🔸అలియాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బైక్ ర్యాలీ
🔸సంక్షేమం, అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రగతి : నక్క ప్రభాకర్ గౌడ్
ఆర్.జె.న్యూస్, మేడ్చల్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గురువారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ బైక్ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా నక్క ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తూ తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రానున్న రోజుల్లో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు ముద్దం సుధాకర్ రెడ్డి, జశ్వంత్ రెడ్డి, డైరెక్టర్లు తుంకి బిక్షపతి, బొమ్మక్ శ్రీనివాస్, భూమిరెడ్డి నవీన్ రెడ్డి, సరసం అశోక్ రెడ్డి, యంజాల సుజాత రెడ్డి, బండారి బాబు, కోడూరి దినేష్, గుర్కాల సాయి కృష్ణ యాదవ్, నేమురి రాంప్రసాద్ గౌడ్, ముద్దం రాఘవ రెడ్డి, సంగనామైనా కుమార్ యాదవ్‌తో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు తంటం రాము, పప్పుల వేణుగోపాల్ రెడ్డి, ముద్దం వీరారెడ్డి, ధర్మారెడ్డి, బోయిని సాయి కుమార్, గిర్మాపూర్ నర్సింగరావు గౌడ్, కొమ్ము వినోద్, వీరన్నగారి భూపాల్, సాయి, చిలుగురి మల్లేష్, తుంకి స్వామి, వల్లపు మహేష్, గంగిరెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

