Friday, October 2, 2026
Homeమేడ్చల్ జిల్లామౌలిక వసతుల కల్పనే ప్రాధాన్యం :...

మౌలిక వసతుల కల్పనే ప్రాధాన్యం : చైర్మన్ జాము రవి

📰 Generate e-Paper Clip

🔸రూ.5 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ

ఆర్ జె న్యూస్, మూడుచింతలపల్లి : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని మున్సిపల్‌ చైర్మన్‌ జాము రవి తెలిపారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 3వ, 8వ వార్డుల్లో మొత్తం రూ.5 లక్షల విలువైన పనులకు భూమిపూజ నిర్వహించారు.3వ వార్డులో రూ.2.50 లక్షలతో మంచినీటి పైప్‌లైన్‌, 8వ వార్డులో మరో రూ.2.50 లక్షలతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను చేపట్టనున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే ప్రాధాన్యమని చైర్మన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాము రవి మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటగోపాల్‌, డీఈ స్ఫూర్తి, కౌన్సిలర్లు గొంది శ్రీవాణి వైద్యనాథ్‌, చిన్నలచ్చ సరిత శ్రీనివాస్‌గౌడ్‌, దోసకాయల లతా వెంకటేశ్‌, పెద్దిరెడ్డి శ్రీలత వెంకటరెడ్డి, రాజిగల్ల లతా భూపాల్‌, మాజీ ఎంపీటీసీ నాగరాజు, మాజీ సర్పంచ్‌ సింగం ఆంజనేయులు, నాయకులు వెంకటనర్సింహారెడ్డి, వెంకటేశ్‌, శావుకారి, మంద స్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!