Friday, October 2, 2026
Homeమేడ్చల్ జిల్లాకేఎల్ఆర్ వెంచర్ లో మౌలిక సమస్యలకు...

కేఎల్ఆర్ వెంచర్ లో మౌలిక సమస్యలకు త్వరలో చెక్

📰 Generate e-Paper Clip

🔸రెండు రోజుల్లో డ్రైనేజీపై జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : మేడ్చల్‌ సర్కిల్‌ పరిధిలోని కేఎల్‌ఆర్‌ వెంచర్‌లో నెలకొన్న మౌలిక సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని జోనల్‌ కమిషనర్‌ పింకేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి డ్రైనేజీ లీకేజీలు, తాగునీటి ఎద్దడి, అంతర్గత రహదారుల దుస్థితిని పరిశీలించారు. స్థానికులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమస్యలపై చర్చించారు.

డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ

కేఎల్‌ఆర్‌ వెంచర్‌లో గతంలో ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైపులు చిన్నగా ఉండటంతోపాటు పలుచోట్ల దెబ్బతిన్నాయని, దీంతో మురుగునీరు సక్రమంగా ప్రవహించక ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కాలనీ మాస్టర్‌ప్లాన్‌ ఆధారంగా నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల 300, 450 ఎంఎం పైపులైన్లు, కొత్త మ్యాన్‌హోల్స్‌ ఏర్పాటు చేసేందుకు రెండు రోజుల్లో ఇంజినీరింగ్‌ అధికారులు జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం పూర్తి నివేదిక, అంచనాలను వెంటనే సమర్పించాలని ఇంజినీరింగ్‌ డీఈ విజయలక్ష్మిని ఆదేశించారు. పనులకు అవసరమైన నిధులను త్వరితగతిన మంజూరు చేస్తామని కమిషనర్‌ తెలిపారు.

తాగునీటి సమస్యకు త్వరిత పరిష్కారం

అమృత్‌ పథకం కింద కేఎల్‌ఆర్‌ వెంచర్‌లో పెండింగ్‌లో ఉన్న తాగునీటి పైపులైన్‌ పనులను త్వరగా పూర్తి చేసి ప్రధాన పైపులైన్‌తో అనుసంధానం చేయాలని కాలనీవాసులు కోరారు. 298వ డివిజన్‌లో తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని మాజీ కౌన్సిలర్‌, డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్‌గౌడ్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు.సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని తాగునీటి సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని జోనల్‌ కమిషనర్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ సుధాంషు, డీఈలు విజయలక్ష్మి, ఏఈలు మమత, తిరుపతి, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్లు రాంచందర్‌, భాస్కర్‌, విఘ్నేష్‌, కాంగ్రెస్‌ నాయకుడు శేఖర్‌గౌడ్‌, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!