Saturday, October 3, 2026
Homeమేడ్చల్ జిల్లాకండ్లకోయలో సీఎంఆర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో...

కండ్లకోయలో సీఎంఆర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సేవా పక్షోత్సవాల ర్యాలీ

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : సేవా పక్షోత్సవాల్లో భాగంగా సీఎంఆర్ సాంకేతిక కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కండ్లకోయలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కళాశాలకు చెందిన సుమారు 100 మంది ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ సి. గోపాల్ రెడ్డి, డైరెక్టర్ ఎ. రాజిరెడ్డి, విద్యార్థి వ్యవహారాల డీన్ డా. డి. మణయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మోపిదేవి సాహుల్ పాల్గొని సేవకులను ప్రోత్సహించారు. స్వచ్ఛంద సేవకులు ప్లకార్డులు, నినాదాలతో సామాజిక సేవ, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, బాధ్యతాయుత పౌరసత్వంపై ప్రజలకు అవగాహన కల్పించారు. సమాజ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సేవే సమాజ అభివృద్ధికి మార్గం అనే సందేశంతో నిర్వహించిన ఈ ర్యాలీ స్థానికులను ఆకట్టుకుంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!