Tuesday, November 24, 2026
Homeమేడ్చల్ జిల్లాప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా

ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. తెలంగాణ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన అసమాన త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అని అన్నారు. వారి పోరాట స్ఫూర్తితో జిల్లాను అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు అధికారులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు చేరవేయడంతోపాటు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కలెక్టర్‌ మను చౌదరి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు.మహిళల ఆర్థికాభివృద్ధి, అంగన్‌వాడీల నిర్వహణ, రేషన్‌కార్డుల పంపిణీ, అభయహస్తం, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరా మహిళా శక్తి, ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా, మహిళలు, చిన్నారుల భద్రతకు టీ-సేఫ్‌ యాప్‌ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధుల స్ఫూర్తితో సంక్షేమం, సమతుల్య అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్‌ మను చౌదరి, ఉప్పల్‌ డీసీపీ సురేష్‌కుమార్‌, అదనపు కలెక్టర్లు ఫైజాన్‌ అహ్మద్‌, విజయేందర్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌ నర్సింహులుయాదవ్‌, గ్రంథాలయ కమిటీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీఏ కమిటీ సభ్యుడు జైపాల్‌రెడ్డి, డీఆర్వో మాలతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు

.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!