Wednesday, September 2, 2026
Homeమేడ్చల్ జిల్లా3 డివిజన్లలో మీ-సేవ కేంద్రాల కొరత...

3 డివిజన్లలో మీ-సేవ కేంద్రాల కొరత – మంత్రిని కలిసిన మాజీ కౌన్సిలర్

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇంచార్జి మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబును బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడు డివిజన్లలో (297, 298, 299) మరియు ఎల్లంపేట మున్సిపాలిటీలో జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ మీ-సేవ కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ప్రస్తుతం ఉన్న మీ-సేవ కేంద్రాలు సరిపోవడం లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం అదనపు మీ-సేవ కేంద్రాలను మంజూరు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!