🔸వ్యక్తిగత విమర్శల కోసం కాదు.. ప్రజల సమస్యల పరిష్కారానికే నిరసన
🔸ఎల్లంపేట మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీదేవి రమేష్
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించేందుకు కాదని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వానికి, ప్రజలకు గుర్తుచేసేందుకేనని ఎల్లంపేట మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీదేవి రమేష్ అన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లంపేట్ మున్సిపల్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.ఎన్నికల సమయంలో 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారని, అయితే అధికారంలోకి వచ్చి సుమారు 1000 రోజులు కావస్తున్నా అనేక హామీలు అమలుకు నోచుకోలేదని ఆమె ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ఈ ఆందోళనల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని శ్రీదేవి రమేష్ అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తుందని తెలిపారు.
హామీలు అమలయ్యే వరకు పోరాటం
RELATED ARTICLES
