ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : శ్రీ కృష్ణ జన్మాష్టమీని పురస్కరించుకొని శుక్రవారం హరే కృష్ణ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించనున్నట్టు సమాజ్ సభ్యులు తెలిపారు. స్థానిక శ్రీ గార్డెన్లో మధ్యాహ్నం 3 గంటలకు వేడుకలు ప్రారంభమై అర్ధరాత్రి 12 గంటల వరకు కొసాగుతాయన్నారు. ఈ సందర్భంగా బహుమతుల వితరణ, ఉట్టి కొట్టడం, గోపూజ, తులసిపూజ, సంధ్యాహారతి, లడ్డూ గోపాల్ ఉయ్యాల సేవ, మహాభిషేకం, చప్పన్ భోగ్, పుష్పాభిషేకం, మహాప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు, ప్రజలు పాల్గొని, విజయంతం చేయాలని వారు కోరారు.
