Friday, September 4, 2026
Homeమేడ్చల్ జిల్లావైఎస్సార్‌ ఆశయాలే మార్గదర్శకం

వైఎస్సార్‌ ఆశయాలే మార్గదర్శకం

📰 Generate e-Paper Clip

🔸మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద ఘనంగా వర్ధంతి కార్యక్రమం

🔸 వైఎస్సార్‌ విగ్రహానికి భారీ గజమాల

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలు కాంగ్రెస్‌ పార్టీకి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని డీసీసీ అధ్యక్షుడు తొటకూర వజ్రేష్‌ యాదవ్‌ అన్నారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని వైఎస్సార్‌ విగ్రహానికి భారీ గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తొటకూర వజ్రేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం వైఎస్సార్‌ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ఆయన అనేక కార్యక్రమాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌ ఆశయాల సాధనకు ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం మాజీ DCC అధ్యక్షుడు హరివర్ధన్‌ రెడ్డి వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, ఆయనతో గడిపిన సందర్భాలను స్మరించుకున్నారు.కార్యక్రమంలో మాజీ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు నక్క ప్రభాకర్‌ గౌడ్,జిల్లా ఉప అధ్యక్షులు బాల్ రెడ్డి, బి పి టి రాజు, మహేష్, జిల్లా అధికార ప్రతినిధి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు చాప రాజు,మల్లేష్ గౌడ్,మాజీ మండల అధ్యక్షుడు రమణ రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు శంకర్,రేగు రాజు,కౌన్సిలర్ల విఘ్నేశ్వర రెడ్డి,మాజీ కౌన్సిలర్ల దేవా,మహేష్ , మధుకర్ యాదవ్,రవీందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి , వెంకట్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!