🔸కిటికీ పగులగొట్టి.. వెనుక గోడకు రంధ్రం
🔸స్ట్రాంగ్‌రూమ్‌లోకి చొరబడలేక వెనుదిరిగిన దుండగులు
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధి ఏదులాబాద్‌లో సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. బుధవారం ఉదయం బ్యాంక్ తెరిచిన సిబ్బంది కిటికీ పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. అలాగే స్ట్రాంగ్‌రూమ్ సమీపంలోని వెనుక గోడకు రంధ్రం చేసినట్లు గుర్తించారు. దుండగులు బ్యాంకులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పటికీ.. స్ట్రాంగ్‌రూమ్‌లోకి మాత్రం చొరబడలేకపోయారు. దీంతో నగదు, విలువైన వస్తువులు, కీలక పత్రాలు ఏవీ చోరీ కాలేదు. ఈ ఘటనపై బ్యాంక్ మేనేజర్ రంజిత్ ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం అధికారులు ఆధారాలను సేకరించారు. బ్యాంకు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ.. చోరీకి యత్నించిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

