Saturday, October 3, 2026
Homeమేడ్చల్ జిల్లావీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు...

వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు – జిల్లా కలెక్టర్ మను చౌదరి

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి, చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ అభివృద్ధి అధికారి టి. ఝాన్సీరాణి మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. సామాజిక అన్యాయం, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన గొప్ప మహిళ అని కొనియాడారు. ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ ధైర్యం, ఆత్మవిశ్వాసం, సామాజిక న్యాయం నేర్పుతుందని, మహిళలు ఐలమ్మ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. విజయేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. మాలతి, ఎస్సీ అభివృద్ధి అధికారి జి. వినోద్ కుమార్, ఏఓ సీతారాం, రజక సంఘం నాయకులు ఆంజనేయులు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!