Sunday, August 16, 2026
Homeతెలంగాణహైదరాబాద్అక్రమ సంబంధం బహిర్గతం - భర్త,...

అక్రమ సంబంధం బహిర్గతం – భర్త, ప్రియురాలిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

హైదరాబాద్, ఉప్పల్, (ఆర్ జె న్యూస్) జూలై 9 :

ఉప్పల్ ప్రాంతంలో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భర్తను భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు చంబేటి కుమారి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాకు చెందిన ఆమె 2004లో ఇంట్లో వారిని ఒప్పించి శివ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇంటర్ చదువుతున్న కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న శివ 2021 వరకు కుటుంబాన్ని బాగానే చూసుకున్నాడు. అయితే అదే సమయంలో తమ ఇంట్లో పనిమనిషిగా పనిచేసిన లక్ష్మితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కుమారి ఆరోపించింది. దీంతో కుటుంబంలో తరచూ గొడవలు మొదలయ్యాయి.

విడిగా ఉంటున్న 5 ఏళ్లు :-

2021లో కరోనా సమయంలో స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత భర్త శివ తనను, కుమార్తెను ఇంట్లోకి రానివ్వకుండా వెళ్లగొట్టాడని కుమారి ఆరోపించింది. అప్పటి నుంచి ఐదేళ్లుగా భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. అనంతరం శివ తనకు విడాకుల నోటీసులు పంపినట్లు, ప్రస్తుతం ఆ కేసు కోర్టులో విచారణలో ఉందని ఆమె తెలిపింది.

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగింత :-

ఈ క్రమంలో ఉప్పల్ కురుమనగర్‌లోని ఓ ఇంట్లో శివ, లక్ష్మి కలిసి ఉంటున్నారనే సమాచారం కుమారికి అంది. వెంటనే బంధువుల సహాయంతో అక్కడికి వెళ్లిన ఆమె ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని పోలీసులకు అప్పగించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!