Friday, August 28, 2026
Homeఎడిటోరియల్అల్వాల్‌లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట.. 16...

అల్వాల్‌లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట.. 16 మంది అరెస్ట్

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, క్రైమ్ బ్యూరో : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనాజిగూడ యాదమ్మ నగర్‌లో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 16 మందిని అల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో ఇంటిపై దాడి చేసిన పోలీసులు పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నారు.వారి వద్ద నుంచి రూ.1.82 లక్షల నగదు, 3 కార్లు, ఒక ద్విచక్ర వాహనం, 16 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అల్వాల్ సీఐ ప్రశాంత్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!