Friday, August 28, 2026
Homeమేడ్చల్ జిల్లాబాచుపల్లిలో ‘తెలుగింటి కిచెన్’ ఘనంగా ప్రారంభం

బాచుపల్లిలో ‘తెలుగింటి కిచెన్’ ఘనంగా ప్రారంభం

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్ డెస్క్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పరిధిలో రామకృష్ణ సరేపూడి నూతనంగా ఏర్పాటు చేసిన ‘తెలుగింటి కిచెన్’ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ.. యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. స్థానికంగా వ్యాపారాలు అభివృద్ధి చెందడం ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమ నైపుణ్యాలను వినియోగించుకుని స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం తెలుగింటి కిచెన్‌ను పరిశీలించిన హన్మంత్ రెడ్డి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం విజయవంతంగా కొనసాగి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు వారాగాని వాసు, డీసీసీ జనరల్ సెక్రటరీ మౌళేశ్వర్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యప్రసాద్, చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!