Sunday, August 16, 2026
Homeమేడ్చల్ జిల్లాఆపదలో విద్యార్థికి అండగా సీఎంఆర్.. ఉచిత...

ఆపదలో విద్యార్థికి అండగా సీఎంఆర్.. ఉచిత వైద్యం, రూ.1.90 లక్షల ఆర్థిక సాయం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలో కండ్లకోయలోని సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ రెండో సంవత్సరం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ) చదువుతున్న విద్యార్థి నాగ సతీష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, సీఎంఆర్ విద్యాసంస్థల యాజమాన్యం మానవత్వాన్ని చాటింది. విషయం తెలుసుకున్న సీఎంఆర్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్ గోపాల్ రెడ్డి వెంటనే స్పందించి విద్యార్థికి అన్ని విధాలా అండగా నిలిచారు.చైర్మన్ ఆదేశాల మేరకు నాగ సతీష్‌ను సీఎంఆర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించి, అవసరమైన వైద్య చికిత్సను పూర్తిగా ఉచితంగా అందించారు. విద్యార్థి ఆరోగ్యం మెరుగుపడే వరకు అన్ని ఏర్పాట్లను యాజమాన్యం పర్యవేక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పింది.విద్యార్థి కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా నిధుల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సేకరించిన రూ.1.90 లక్షల చెక్కును చైర్మన్ సీహెచ్ గోపాల్ రెడ్డి విద్యార్థి తల్లిదండ్రులకు అందజేశారు.ఈ సందర్భంగా చైర్మన్ సీహెచ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమమే సీఎంఆర్ విద్యాసంస్థల ప్రధాన లక్ష్యం. ఆపద సమయంలో ప్రతి విద్యార్థికి, వారి కుటుంబానికి అండగా ఉండటం మా బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ ఎంజంగా రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బి. సత్యనారాయణ, హెచ్‌వోడీలు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!