Wednesday, September 9, 2026
Homeక్రైమ్ న్యూస్ఒడిశా నుంచి గంజాయి తెప్పించి విక్రయాలు..!...

ఒడిశా నుంచి గంజాయి తెప్పించి విక్రయాలు..! యువకుడు అరెస్ట్

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ :

ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి అక్రమంగా విక్రయిస్తున్న ఓ యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన అలోక్ సర్కార్ (20) ప్రస్తుతం కిస్తాపూర్ నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు సోహైల్ (22) సహకారంతో ఒడిశా నుంచి 2 కిలోల ఎండు గంజాయిని విక్రయాల కోసం తెప్పించినట్లు విచారణలో వెల్లడైంది.విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు అలోక్ సర్కార్‌ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి సుమారు రూ.లక్ష రూపాయలు విలువైన 2 కిలోల ఎండు గంజాయితో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సహచరుడు సోహైల్ ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మేడ్చల్ సీఐ సత్యనారాయణ వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!