Friday, August 28, 2026
Homeఎడిటోరియల్ఓటరు జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ...

ఓటరు జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలని అలియాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం SIR పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఓటరుగా ఉన్నవారు తమ పేరు, చిరునామా తదితర వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. జాబితాలో పేర్లు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా సంబంధిత అధికారులను సంప్రదించి సకాలంలో సవరించుకోవాలని తెలిపారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. SIR ప్రక్రియలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!