ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ ఎన్‌హెచ్-44పై నిలిచిపోయిన ఫ్లైఓవర్ పనులను వెంటనే పునఃప్రారంభించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మేడ్చల్ బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు మెమొరాండం సమర్పించారు.. మేడ్చల్ చెక్‌పోస్ట్ నుంచి అత్వెల్లి వరకు ఎన్‌హెచ్-44 రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు తెలిపారు. రహదారి దుస్థితి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగిపోయిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించడంతో పాటు, దెబ్బతిన్న రహదారిని పూర్తిగా పునర్నిర్మించాలని వారు కోరారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసి, ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఎంపీ ఈటల రాజేందర్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగరాజు ముదిరాజ్, లాయక్ అలీ, బాలరాజ్ ముదిరాజ్, బాల మల్లేష్ యాదవ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్‌హెచ్-44 పనులపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ నేతలు కోరారు.
గుంతల రోడ్డుతో ప్రాణాలు పోతున్నాయి – ఈటెలకు వినతి
RELATED ARTICLES
