Friday, October 2, 2026
HomeతెలంగాణGHMCమేడ్చల్ లో అక్రమ రేకుల షెడ్లపై...

మేడ్చల్ లో అక్రమ రేకుల షెడ్లపై అధికారుల చర్య

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ :

మేడ్చల్ రైల్వే స్టేషన్ రోడ్డు వెంట అనుమతులు లేకుండా రోడ్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ రేకుల షెడ్లను అధికారులు శనివారం కూల్చివేశారు.

 

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సీపీ ఆదేశాల మేరకు ఏసీపీ భాస్కర్, టీపీఎస్ సాయి తేజ ఆధ్వర్యంలో ఈ కూల్చివేత చర్యలు చేపట్టారు. రోడ్డు విస్తరణకు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని గుర్తించిన అధికారులు ముందస్తు నోటీసులు జారీ చేసిన అనంతరం షెడ్లను తొలగించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రహదారులను ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేని నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు కూడా రోడ్డు స్థలాలను ఆక్రమించకుండా సహకరించాలని, నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పోలీసులు భారీగా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!