♦️ అత్యవసరంగా స్పందించిన 108 సిబ్బంది..!
♦️ ప్రథమ చికిత్స అనంతరం ఆస్పత్రికి తరలింపు..!
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి తండ్రితో పాటు ముగ్గురు చిన్నారులు గాయపడిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింతల శ్రీనివాస్ (37) ఇంట్లో గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో శ్రీనివాస్‌తో పాటు ఆయన కుమార్తెలు ప్రవళిక (14), హరిప్రియ (10), కుమారుడు విక్రాంత్ (6) గాయపడ్డారు.పేలుడు శబ్దం విన్న స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. మేడ్చల్ 108 సిబ్బంది ఈఎంటీ సీతారాం, పైలట్ బాలకృష్ణ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఈఆర్‌సీపీ డా. చక్రవర్తి సూచనల మేరకు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించి బాధితులకు చికిత్స అందించిన 108 సిబ్బంది ఈఎంటీ సీతారాం, పైలట్ బాలకృష్ణ సేవలను స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
