ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ సర్కిల్ పరిధిలోని KLR ఫేజ్-2, రాములోరి మైసమ్మ గుడి కాలనీలో నెలకొన్న తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహిళా సేవా సమితి సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.కాలనీలో తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడం, వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారడం, డ్రైనేజీ నీరు రోడ్లపైకి పొంగిపొర్లుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా రాములోరి మైసమ్మ గుడి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసి, ఆలయాన్ని ఆధునీకరించడంతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.వినతికి స్పందించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాలనీలోని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి కూడా తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు నవీన్ రెడ్డి, కాలనీవాసులు గాంధీ, నర్సింగ్, కృష్ణ, నవీన్, మాధురి, పల్లవి, గంగ తదితరులు పాల్గొన్నారు.

