Sunday, August 16, 2026
Homeమేడ్చల్ జిల్లావిభా స్కూల్‌లో ఉచిత ఆరోగ్య పరీక్షల...

విభా స్కూల్‌లో ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం విజయవంతం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : విద్యార్థుల ఆరోగ్యమే వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది అనే లక్ష్యంతో విభా స్కూల్, మెడికవర్ హాస్పిటల్స్, క్లోవ్ డెంటల్ మరియు మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 1, 2026 (శనివారం) న పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక హెల్త్ చెక్-అప్ క్యాంప్ నిర్వహించబడింది. ఈ శిబిరంలో విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, క్లోవ్ డెంటల్ వైద్యులచే దంత పరీక్షలు, మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ నిపుణులచే కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఆరోగ్య సూచనలు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సంయుక్త నాగోజు మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించడం మరియు చిన్న వయస్సులోనే ఆరోగ్య సమస్యలను గుర్తించడం ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మెడికవర్ హాస్పిటల్స్, క్లోవ్ డెంటల్, మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ వైద్య బృందాలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆరోగ్య శిబిరాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు పాఠశాల యాజమాన్యం ఎంతో అభినందించారు. 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!