Saturday, October 3, 2026
Homeఎడిటోరియల్చీరాలలో ఘనంగా బొడ్రాయి పండుగ మహోత్సవం

చీరాలలో ఘనంగా బొడ్రాయి పండుగ మహోత్సవం

📰 Generate e-Paper Clip

⚫ ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్

ఆర్ జె న్యూస్, కీసర : మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కీసర సర్కిల్ పరిధిలోని చీరాల గ్రామంలో బొడ్రాయి పండుగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వజ్రెష్ యాదవ్ గ్రామ ప్రజలతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ బొడ్రాయి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. గ్రామీణ సంప్రదాయాలు, పండుగలే మన సంస్కృతికి ప్రతీకలని, వాటిని భావి తరాలకు అందించే బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కీసర డివిజన్ అధ్యక్షులు స్వప్న విజయ్ రెడ్డి, మాజీ కీసర మండల్ అధ్యక్షులు కోళ్ల కృష్ణ యాదవ్, డీసీ సెక్రెటరీ నర్సింగ్ రావు, శ్రీనివాస్ గౌడ్, రమేష్ గుప్త, లక్ష్మణ శర్మ, మధు సుధన్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!