ఆర్ జె న్యూస్, మేడ్చల్ జవహర్ నగర్ లో సమ్మయ్య అనే దివ్యాంగునికి 15 రోజుల క్రితం కారు ఢీకొట్టడంతో దివ్యాంగుడు సమ్మయ్య తీవ్ర గాయాల పాలయ్యాడు. అప్పటికప్పుడు ప్రవేట్ హాస్పిటల్ లో చేర్పించినప్పటికీ ఆదివారం రోజు తీవ్ర అవస్థకు గురైన సమ్మయ్యను గాంధీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్లిన అతను చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొనార్ దుర్గాప్రసాద్ జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ పెట్టి శెట్టి శ్రీనివాస్ గుప్తా కు విషయం తెలియజేయడం జరిగింది. వెంటనే స్పందించిన డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ 5000 రూపాయలు దివ్యాంగుని అంతక్రియకు సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ దివ్యాంగులు కుటుంబంకు అన్నివేళలా అండగా ఉంటారని భవిష్యత్తులో వారి కుటుంబానికి కూడా అండగా నిలబడతానని వారు వారన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొనార్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గతంలో సమ్మయ్య గృహ నిర్మాణానికి కూడా డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా సహాయపడ్డారని గుర్తు చేశారు జవహర్ నగర్ లో వికలాంగులకు అండగా ఉంటూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ కు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, చెన్నాపురం రమేష్, పెట్రోల్ బంక్ నరసింహ, అనూక్ ధనరాజ్. తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుని అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేసిన మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా
RELATED ARTICLES
