ఆర్‌జే న్యూస్, జవహర్‌నగర్ : సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య మహిళా కార్మికులకు మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా దంపతులు బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేశారు.
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి మరువలేనిదని, వారి సేవలను గుర్తించి అండగా నిలవడం తమ బాధ్యత అని శ్రీనివాస్ గుప్తా అన్నారు. బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో ప్రత్యేకమైనదని, పండుగ వేళ వారి ముఖంలో చిరునవ్వు చూడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, రాజ్ కుమార్, శ్రీమన్నారాయణ, మౌనిక రెడ్డి, వసంత, సవిత గౌడ్, లేక గౌడ్, భారతి, రజిత, వనిత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరలను పంపిణీ చేస్తున్న మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి నాగరాణి శ్రీనివాస్ గుప్తా దంపతులు.
