Friday, October 30, 2026
Homeమేడ్చల్ జిల్లాపేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇళ్ల...

పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం భరోసా

📰 Generate e-Paper Clip

🔸 అలియాబాద్‌ మున్సిపాలిటీలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

ఆర్ జె న్యూస్, శామీర్ పేట : పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నాయని అలియాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కంఠం శిరీష కృష్ణారెడ్డి అన్నారు. మేడ్చల్‌ నియోజకవర్గంలోని అలియాబాద్‌ మున్సిపాలిటీ పరిధి లల్గాడి మలక్‌పేట్‌ గ్రామం ఆరో వార్డుకు చెందిన కావటి సరిత, మురళి దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఛైర్‌పర్సన్‌ కంఠం శిరీష కృష్ణారెడ్డి, మున్సిపల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్‌ ముఖ్య అతిథులుగా హాజరై గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ తుంకి బిక్షపతి, జిల్లా కార్యదర్శి భూమిరెడ్డి నవీన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు బండారి బాబు, అబ్బాగౌని భాస్కర్‌గౌడ్‌, చిలుగురి మల్లేష్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, ఇప్ప మాధవరెడ్డి, బండ సతీష్‌, కుంచె సత్యనారాయణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!