Saturday, September 5, 2026
Homeమేడ్చల్ జిల్లామల్కాజిగిరి BRS నేతపై అత్యాచారం, అట్రాసిటీ...

మల్కాజిగిరి BRS నేతపై అత్యాచారం, అట్రాసిటీ కేసు

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మల్కాజిగిరి : మల్కాజిగిరి ఎమ్మెల్యే అనుచరుడు, BRS నాయకుడు జక్కుల కిరణ్‌కుమార్ ముదిరాజ్‌పై నేరెడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారం, దాడి, బెదిరింపులు, SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి కిరణ్‌కుమార్ తనతో సన్నిహితంగా మెలిగారని, వ్యాపారంలో భాగస్వామ్యం పేరుతో తన నుంచి సుమారు రూ.30 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. అనంతరం తనపై, తన 10 ఏళ్ల కుమారుడిపై దాడి చేసి, కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి పరువు తీసే ప్రయత్నం చేశారని, హైదరాబాద్ విడిచి వెళ్లేందుకు రూ.3 లక్షలు ఇస్తామని, లేకపోతే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కిరణ్‌కుమార్ తనను హత్య చేసేందుకు రూ.10 లక్షలు ఖర్చు చేయడానికైనా సిద్ధమని బెదిరించినట్లు ఆరోపించారు. మహిళ ఫిర్యాదు మేరకు నేరెడ్మెట్ పోలీసులు క్రైమ్ నంబర్ 751/2026 నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. BNS సెక్షన్లు 69, 74, 79, 115(2), 351(2)తో పాటు SC/ST (POA) Act-2015లోని సెక్షన్ 3(2)(v) కింద కేసు నమోదు చేసినట్లు నేరేడ్మెట్ పోలీసులు తెలిపారు. ఈ విషయం మల్కాజిగిరి ప్రచార మాధ్యమాలలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అనుచరుడి పై కేసు నమోదు అనే విషయం చెక్కర్లు కొడుతుంది.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!