మేడ్చల్ (ఆర్ జె న్యూస్) జూలై 8 :
మేడ్చల్ మండల విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో బుధవారం పీవీ పాఠశాల ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శంకర్ మాట్లాడుతూ “ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలి. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీవీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామేశ్వరావు, ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
