Sunday, August 16, 2026
HomeతెలంగాణGHMCదేవరయాంజాల్‌లో వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు...

దేవరయాంజాల్‌లో వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు ఘనంగా

దేవరయాంజాల్ (ఆర్ జె న్యూస్) జూలై 8 :
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్, శామీర్‌పేట్ డివిజన్ దేవరయాంజాల్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత ప్రజానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమిడి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ “డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రజల సంక్షేమమే పరమావధిగా పాలన సాగించిన మహోన్నత నాయకుడు. రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు” అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు సామాన్య ప్రజల సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇచ్చిన అరుదైన నాయకుడిగా వైఎస్ఆర్ చరిత్రలో నిలిచిపోయారని, ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ తిరుపతి శంకర్ గౌడ్, శ్రీ సీతారామస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ పేండం లక్ష్మీనారాయణ, మాజీ ధర్మకర్తలు ఎల్లెంకి భారతి, వలందాసు మురళి గౌడ్, గుడిసేని హరికృష్ణ, తూంకుంట జగదీష్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పిన్నింటి ధర్మారెడ్డి, కందాళ రాము, మిర్యాలకర్ సాయి కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!