అలియాబాద్ (ఆర్ జె న్యూస్) జూలై 8 :
అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మజీద్‌పూర్ గ్రామంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి కంఠం శిరీష కృష్ణ రెడ్డి, కౌన్సిలర్లు సామల జశ్వంత్ రెడ్డి, ముద్దం సుధాకర్ రెడ్డి, AMC డైరెక్టర్ తుంకి బిక్షపతి, జిల్లా కార్యదర్శి భూమిరెడ్డి నవీమ్ రెడ్డి, మాజీ MPTC సరసం అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఏళ్ళ మల్లేష్, కాంగ్రెస్ నాయకులు బండారి బాబు, కోడూరి దినేష్, గురకాల సాయి కృష్ణ, నేమురి రాంప్రసాద్, ఊరడి వెంకటేష్, గాదె యాదగిరి, తుంకి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
