Sunday, August 16, 2026
Homeతెలంగాణరైతు భరోసా నిధుల విడుదలపై అలియాబాద్‌లో...

రైతు భరోసా నిధుల విడుదలపై అలియాబాద్‌లో సంబరాలు

అలియాబాద్ (ఆర్ జె న్యూస్) జూలై 8 :
అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్ రైతు వేదిక వద్ద రైతు భరోసా నిధులు పెద్దఎత్తున విడుదలైన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, రైతులు బుధవారం సంబరాలు జరుపుకున్నారు. అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు భరోసా నిధులతో రైతులకు ఆర్థిక భరోసా లభిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణ రెడ్డి, A బ్లాక్ అధ్యక్షులు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు సామల జశ్వంత్ రెడ్డి, ముద్దం సుధాకర్ రెడ్డి, AMC డైరెక్టర్ తుంకి బిక్షపతి, మాజీ MPTC సరసం అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఏళ్ళమల్లేష్, కాంగ్రెస్ నాయకులు బండారి బాబు, కోడూరి దినేష్, గురకాల సాయి కృష్ణ, నేమురి రాంప్రసాద్, ఊరడి వెంకటేష్, గాదె యాదగిరి, తుంకి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!