శామీర్ పేట, జూన్ 30 : తెలంగాణ ప్రభుత్వం సమగ్ర శిక్షా ఆధార్ కార్యక్రమంలో భాగంగా మెడ్చల్ జిల్లా విద్యాశాఖ ‘ఉత్తమ ఆధార్ ఆపరేటర్ – 2025’ అవార్డునుశామీర్ పేట మండలానికి చెందిన ఉదయశ్రీకి ప్రదానం చేసింది.
జిల్లావ్యాప్తంగా పాఠశాలలను స్వయంగా సందర్శించి, అత్యధిక సంఖ్యలో విద్యార్థుల ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయడంలో ఆమె చూపిన చొరవ, అంకితభావం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారులు కొనియాడారు.
క్షేత్రస్థాయిలో విద్యార్థులకు ఆధార్ సేవలు అందించడంలో ఉదయశ్రీ చేస్తున్న కృషిని అధికారులు ప్రత్యేకంగా ప్రశంసించారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఇతర ప్రభుత్వ పథకాలు అందడానికి ఆధార్ తప్పనిసరి కావడంతో ఆమె సేవలు ఎంతో కీలకమయ్యాయి.
“విద్యార్థుల భవిష్యత్ కోసం చేస్తున్న ఈ సేవలో గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. ప్రతి విద్యార్థికి ఆధార్ అందేలా ఇంకా కృషి చేస్తాను” అని అవార్డు అందుకున్న అనంతరం ఉదయశ్రీ పేర్కొన్నారు.
