Sunday, August 16, 2026
HomeతెలంగాణGHMCసీఎంఆర్‌ఐటీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు...

సీఎంఆర్‌ఐటీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు – విద్యార్థులకు డిగ్రీలు అందజేత

గుండ్లపోచంపల్లి (ఆర్ జె న్యూస్) జూలై 12 :

గుండ్లపోచంపల్లి మండలం కండ్లకోయలో గల సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీఎంఆర్‌ఐటీ)లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మరియు సీఎంఆర్ గ్రూప్ ఫౌండర్ చైర్మన్ చామకూర మల్లారెడ్డి హాజరై ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఇంజనీరింగ్ తర్వాత ప్రతి విద్యార్థి భవిష్యత్తును ప్రణాళిక బద్ధంగా మలుచుకుంటే మల్లారెడ్డి కన్నా గొప్పవారు అవుతారు. విద్యార్థుల యొక్క నిజమైన జీవితం ఇక్కడి నుండే మొదలవుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత భవిష్యత్ ఉంటుంది” అని సూచించారు.

ప్రతిజ్ఞ చేయించిన జేఎన్టీయూ రెక్టర్

మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఎన్టీయూ హైదరాబాద్ రెక్టర్ డా. ఏ. దామోదరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించి ఇంజనీరింగ్ పట్టాలు అందజేశారు. “జ్ఞానమే ఎల్లప్పుడూ అత్యంత విలువైన సంపద. విద్య ద్వారా సంపాదించిన జ్ఞానం జీవితాంతం మనతోనే ఉంటుంది” అని విద్యార్థులకు సందేశమిచ్చారు.

NEP, వికసిత భారత్ పై ప్రసంగం

గెస్ట్ ఆఫ్ హానర్‌గా హాజరైన ఐఐటీ హైదరాబాద్ డీన్ అకాడమిక్స్ అశోక్ కుమార్ పాండే మాట్లాడుతూ ఇటీవలి కాలంలో రెండు ముఖ్యమైన మార్పులు వచ్చాయని తెలిపారు. ఒకటి కొత్త విద్యా విధానం – NEP, ఇది పుస్తక జ్ఞానం నుండి ఆచరణాత్మక జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తుందని, రెండవది “వికసిత భారత్ విజన్-2047” అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

స్టార్టప్‌లపై దృష్టి పెట్టాలి : గోపాల్ రెడ్డి

సీఎంఆర్ గ్రూప్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు మొత్తం టెక్నాలజీ వైపు నడుస్తోందని, ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరాలని, కొత్త స్టార్టప్ కంపెనీలను ప్రారంభించాలని విద్యార్థులకు సూచించారు.

 

కళాశాల విజయాలను వివరించిన డైరెక్టర్

సీఎంఆర్‌ఐటీ డైరెక్టర్ డా. జంగారెడ్డి గత నాలుగు సంవత్సరాల కళాశాల విజయాలను వివరిస్తూ, క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ గ్రూప్ సీఈఓ అభినవ్ రెడ్డి, శ్రీశైలం రెడ్డి, భూపాల్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డా. సత్యనారాయణ, ఇతర కళాశాలల ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఓడిలు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!