Sunday, August 16, 2026
Homeక్రైమ్ న్యూస్సీసీటీవీ ఆధారాలతో చాకచక్యంగా ఛేదించిన సెల్‌ఫోన్...

సీసీటీవీ ఆధారాలతో చాకచక్యంగా ఛేదించిన సెల్‌ఫోన్ స్నాచింగ్ కేసు..! దర్యాప్తు అధికారి డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కు ప్రశంసలు..!

మేడ్చల్ (ఆర్ జె న్యూస్) జూలై 11 :

జూన్ 19న మేడ్చల్ చెక్‌పోస్ట్ సమీపంలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు సెల్‌ఫోన్‌ను లాక్కొని పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అధికారి డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విచారణ చేపట్టిన బృందం ఘటనాస్థల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించింది. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని సమన్వయం చేస్తూ నిందితుడి కదలికలను గుర్తించి, అతడిని మేడ్చల్‌లో ప్లంబర్‌గా పనిచేస్తున్న నవీన్‌గా గుర్తించారు.అనంతరం చేపట్టిన వాహనాల తనిఖీల్లో కీస్తాపూర్ వద్ద నవీన్ పోలీసులకు చిక్కాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు.సాంకేతిక ఆధారాలను సమర్థంగా వినియోగిస్తూ తక్కువ సమయంలోనే కేసును ఛేదించిన దర్యాప్తు అధికారి డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ పనితీరుపై పోలీసు వర్గాల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో ఎస్‌ఐ నవీన్‌ కుమార్ తో పాటు కానిస్టేబుళ్లు నరసింహారెడ్డి, దినేష్, ఝాన్సీ, భీమేష్ కీలక పాత్ర పోషించారు. బృంద సమన్వయం, సాంకేతిక విశ్లేషణ, వేగవంతమైన చర్యలతో నిందితుడిని అరెస్టు చేసి కేసును ఛేదించడంలో వారి కృషి అభినందనీయమని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!