ఆర్ జె న్యూస్ మేడ్చల్ :
13 ఏళ్లు నిండిన, 15 ఏళ్లలోపు బాలికలు హెచ్పీవీ వ్యాక్సిన్ విధిగా తీసుకోవాలని మేడ్చల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు నీరజ్ సూచించారు. శనివారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో 200 మందికి హెచ్పీవీ వ్యాక్సిన్ ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… హెచ్ పి వి వ్యాక్సిన్ తో బాలికలకు భవిష్యత్తులో సోకే సర్వైకల్ క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టవచ్చు అన్నారు. బాలికల తల్లిదండ్రులు అవగాహన పెంచుకొని వ్యాక్సిన్ అందజేయాలన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రం తో పాటు సివిల్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందన్నారు కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
