Wednesday, September 9, 2026
Homeమేడ్చల్ జిల్లారైలు ప్రమాదంలో గాయపడిన యువకుడిని కాపాడిన...

రైలు ప్రమాదంలో గాయపడిన యువకుడిని కాపాడిన 108 సిబ్బంది

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్,మేడ్చల్: కామారెడ్డి నుంచి మేడ్చల్‌కు రైలులో వస్తున్న గట్టమి సతీష్‌ (38) మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో రెండు కాళ్లతో పాటు ఎడమ చేయికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ సీతారాం, పైలట్‌ తిరుపతి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈఆర్‌సీపీ డాక్టర్‌ శివ సూచనల మేరకు సతీష్‌కు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. సకాలంలో స్పందించి తన ప్రాణాలను కాపాడిన 108 సిబ్బంది సీతారాం, తిరుపతికి సతీష్‌ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సతీష్‌ కాకినాడ జిల్లా సిరిపురం వాసి కాగా, ప్రస్తుతం గండిమైసమ్మలో నివాసం ఉంటూ డాక్టర్‌ రెడ్డి ల్యాబ్స్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!