Friday, August 14, 2026
Homeమేడ్చల్ జిల్లా20 వేల లీటర్ల ఉచిత నీటి...

20 వేల లీటర్ల ఉచిత నీటి హామీ వెంటనే అమలు చేయాలి

ఆర్ జె న్యూస్, మేడ్చల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి హామీని వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గుండ్లపోచంపల్లి డివిజన్ అధ్యక్షుడు కావేరి శ్రీధర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర నాయకుడు విక్రమ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, దేశసేవే లక్ష్యంగా పనిచేసే జాతీయవాద ఉద్యమమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.అలాగే ప్రతి కార్యకర్త ప్రజల సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పేదరిక నిర్మూలన, ఉచిత బియ్యం, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేక తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.స్థానిక సమస్యలపై కూడా సమావేశంలో తీర్మానం చేశారు. గుండ్లపోచంపల్లిలో మంచినీటి బిల్లులను ఇష్టానుసారంగా పెంచడం, అంతర్గత రహదారుల దుస్థితి, వీధిదీపాల నిర్వహణలో నిర్లక్ష్యం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీజేపీ శ్రేణులు పోరాటం కొనసాగిస్తాయని నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు రంజిత్ మోహన్, నాయకులు కృష్ణగౌడ్, లక్ష్మారెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, హంసారాణి, డివిజన్ ఇన్‌చార్జి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు విష్ణువర్ధన్ రెడ్డి, ఉషిగారి శ్రీనివాస్ ముదిరాజ్, సాకారబోయిన వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చింతలపూడి రామారావు, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, బాలకృష్ణ, గుంటి నాగరాజ్, కార్యదర్శి వాసగొని వెంకటేష్ గౌడ్‌తో పాటు పార్టీ సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, శక్తికేంద్ర ఇన్‌చార్జీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!