Saturday, September 12, 2026
Homeతెలంగాణహైదరాబాద్ట్రైలర్ లేకుండానే 'ది ప్యారడైజ్' రిలీజ్.....

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ రిలీజ్.. క్లారిటీ ఇచ్చిన నాని

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ పై కీలక అప్డేట్ వచ్చింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను మేకర్స్ వేగవంతం చేశారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో హీరో నాని సంచలన ప్రకటన చేశారు. ‘ది ప్యారడైజ్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయడం లేదని స్పష్టం చేశారు. విడుదలకు తక్కువ సమయం ఉండటంతో ట్రైలర్ లేకుండానే నేరుగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ట్రైలర్ లేకుండా సినిమా రావడం వల్ల సినిమాపై అంచనాలు, ఉత్కంఠ మరింత పెరుగుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!