Friday, October 9, 2026
Homeక్రైమ్ న్యూస్రోటోవేటర్‌లో పడి ట్రాక్టర్ డ్రైవర్ మృతి

రోటోవేటర్‌లో పడి ట్రాక్టర్ డ్రైవర్ మృతి

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : ట్రాక్టర్‌తో రోటోవేటర్‌ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి రోటోవేటర్‌కు తగిలి డ్రైవర్‌ మృతిచెందిన విషాద ఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణపూర్‌ గ్రామానికి చెందిన గడ్డమీది గురువయ్య (42) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారీ పనుల్లో భాగంగా బుధవారం పోతారం గ్రామంలోని వంగ కృష్ణారెడ్డికి చెందిన తోటలో ట్రాక్టర్‌తో రోటోవేటర్‌ పనులు చేస్తున్నాడు.ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గురువయ్య ట్రాక్టర్‌ నుంచి కిందపడగా.. రోటోవేటర్‌ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు.సమాచారం అందుకున్న శామీర్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!