ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : చంద్రపురి కాలనీ డివిజన్‌లోని పాతబస్తీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. 130 మీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ… గతంలో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ గత పాలకుల చుట్టూ తిరిగినా, గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డివిజన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని, అభివృద్ధికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం స్థానిక ప్రజలు శ్రీకాంత్ యాదవ్ ను శాలువాతో సత్కరించి, ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి సదానంద్, మాజీ కార్పొరేటర్ నవీన్ కుమార్, సతీష్ గౌడ్, ఎస్సీ సెల్ ఏ బ్లాక్ అధ్యక్షులు మాట్లా శ్రీనివాస్, నాయకులు రజిత గోపాల్, లత, సునీత, మేరీ, చిట్టిబాబు, అశోక్ గుప్తా, బూడిద వెంకటేష్, సాయి కృష్ణ (మిట్టు), బబ్లూ ముదిరాజ్, కదం రాహుల్, అజయ్ కుమార్, రమేష్ గౌడ్, సదానంద్ కురుమ, ఐలేను, కొమరయ్య, నాగరాజు, అనిల్, విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రపురి కాలనీలో యూజీడీ, సీసీ రోడ్లకు శంకుస్థాపన
RELATED ARTICLES
