Friday, October 9, 2026
Homeమేడ్చల్ జిల్లాసమాచారం సకాలంలో అందించాలి

సమాచారం సకాలంలో అందించాలి

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)ను గౌరవిస్తూ పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఆర్టీఐ వారోత్సవం–2026 అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం–2005 ప్రకారం పౌరులు కోరిన సమాచారాన్ని నిర్ణీత సమయంలో అందించాలన్నారు. స్వచ్ఛందంగా అందించాల్సిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటించాలని జిల్లా అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా అధికారులు, సిబ్బందితో సమాచార హక్కు చట్టంపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్వో మాలతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!