Friday, October 9, 2026
Homeమేడ్చల్ జిల్లాక్షయ రహిత భారత్‌కు యువతే బలం..!...

క్షయ రహిత భారత్‌కు యువతే బలం..! మేడ్చల్‌ జిల్లాలో ‘జోష్‌’ బృందం ప్రారంభం

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : క్షయ రహిత భారతదేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కీలకమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె. ఆనంద్‌ అన్నారు. ‘టిబి ముక్త్‌ భారత్‌ అభియాన్‌’లో భాగంగా మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలో జోష్‌ (Joint Squad for Health) బృందాన్ని గురువారం ప్రారంభించారు. డా. ఆనంద్‌ మాట్లాడుతూ.. క్షయ నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యం, యువత సహకారం, వైద్యశాఖ సమన్వయం అవసరమన్నారు. ఎన్‌సీసీ క్యాడెట్లు, మై భారత్‌ వాలంటీర్లు టిబిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ‘నిక్షయ్‌ మిత్ర’గా నమోదు చేసుకుని బాధితులకు పౌష్టికాహారం, అవసరమైన సహాయం అందించాలని కోరారు.

అవగాహనతోనే అడ్డుకట్ట

14 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టిబి లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలని, అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారు వైద్యుల సూచన మేరకు మందులను క్రమం తప్పకుండా వాడి చికిత్సను పూర్తిచేయాలన్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు స్క్రీనింగ్‌ నిర్వహించడం, పౌష్టికాహారం అందించడం, మానసిక ధైర్యం కల్పించడం అవసరమన్నారు.

జోష్‌ బృందం ద్వారా టిబి అనుమానితులను గుర్తించడం, పరీక్షలకు ప్రోత్సహించడం, చికిత్స పొందుతున్న వారికి సహకరించడం, ప్రజల్లో అపోహలను తొలగించడం వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఎన్‌సీసీ క్యాడెట్లు, మై భారత్‌ వాలంటీర్లు, టిబి విభాగం సిబ్బంది క్షయ నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో డీఎంహెచ్‌వోతోపాటు ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డా. శ్రీదేవి, ఎన్‌సీసీ అధికారులు, 2, 4వ బెటాలియన్ల క్యాడెట్లు, మై భారత్‌ వాలంటీర్లు, టిబి విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!