ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని కొందరు వ్యక్తులు కబ్జా చేసి కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని మా ఇంటి స్థలాన్ని కబ్జా కాకుండా అధికారులు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని మూడుచింతలపల్లి మున్సిపల్ ఉద్దెమర్రి గ్రామానికి చెందిన భాస్కర కృష్ణా రావు , భాస్కర సీతారాo రావులు ఆరోపించారు. గురువారం శామీర్పేట ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మూడుచింతలపల్లి మున్సిపాలిటి ఉద్దెమర్రి గ్రామంలో తండ్రి కీర్తి శేషులు భాస్కర నరహరి రావు 1981 సంవత్సరంలో అప్పటి గ్రామపంచాయతి ద్వారా ఇంటి అనుమతులు తీసుకుని ఇంటితో పాటు ప్రహారీ గోడను నిర్మించుకున్నామని తెలిపారు. అప్పటి నుంచి ట్యాక్స్లు,విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని పేర్కోన్నారు. నైజాం కాలం నుంచి ఇట్టి భూమి మా ఆధీనంలో ఉందని చెప్పారు. ఇంటికి సంబందించిన డాక్యుమెంట్లు మా వద్ద ఉన్నాయని అనాటి సర్పంచ్ లక్ష్మన రావు ద్వారా తీసుకోవడం జరిగిందన్నారు. కాలక్రమేనా మా ఇల్లు శిధిలావస్థకు చేరుకోవడంతో కోతుల బెడదతో మా పాత ఇంటిని కూల్చివేశామని పేర్కోన్నారు. మా కుటుంబ సభ్యులు ఇట్టి ఇల్లు భూమిని పంచుకొని వేర్వేరుగా ఇంటి నెంబర్లు తీసుకోవడం జరిగిందని తెలిపారు. కొందరు వ్యక్తులు కక్షపూరితంగా మా భూమిని కబ్జా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. గ్రామకంఠం భూమిని ప్రభుత్వ భూమిగా చిత్రీకరిస్తూ మమ్ములను కొందరు వ్యక్తులు తీవ్ర ఇబ్బందులకు,భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అధికారులు దృష్టి సారించి మాకు న్యాయం చేయాలని మా ఇంటి స్థలన్ని ఇతరులు కబ్జా చేయకుండా కాపాడాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ సమావేశంలో భాస్కర నర్సింహా రావు , భాస్కర రవీందర్ రావు ఉన్నారు.
తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిని కాజేసేందుకు కుట్ర
RELATED ARTICLES
