Thursday, October 29, 2026
Homeక్రైమ్ న్యూస్బొలెరో ఢీకొని వ్యక్తి మృతి

బొలెరో ఢీకొని వ్యక్తి మృతి

📰 Generate e-Paper Clip

🔸అలియాబాద్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద ప్రమాదం.. చికిత్స పొందుతూ మృతి

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : జీనోమ్‌ వ్యాలీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి నర్సింలు (55) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్గడి మలక్‌పేట్‌ గ్రామానికి చెందిన నర్సింలు ఈ నెల 12న ఎదులాపూర్‌లోని తన కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి వచ్చారు. సాయంత్రం అలియాబాద్‌ వద్ద బస్సు దిగి, ఎక్స్‌ రోడ్డు సమీపంలోని శుభం గార్డెన్స్‌ ఎదురుగా రహదారికి ఎడమవైపు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం (టీఎస్‌ 07 యూఎల్‌ 2708) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే మెడిసిటీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందారు. మృతుడి భార్య కత్తి లక్ష్మి ఫిర్యాదు మేరకు జీనోమ్‌ వ్యాలీ సీఐ గురువయ్య గౌడ్‌ కేసు నమోదు చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!