ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా గీజర్‌లో అత్యంత నేర్పుగా దాచిన 7.750 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2.71 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడు గీజర్‌లో 73 చిన్న ప్యాకెట్లుగా గంజాయిని దాచి స్మగ్లింగ్‌కు యత్నించాడు. అనుమానం రావడంతో లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఈ అక్రమ రవాణా బయటపడింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన డీఆర్ఐ అధికారులు.. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత – రూ.2.71 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి సీజ్
RELATED ARTICLES
