Wednesday, October 28, 2026
Homeక్రైమ్ న్యూస్ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి బలవన్మరణం

ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి బలవన్మరణం

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, రామంతాపూర్ : ఉప్పల్ పరిధి రామంతాపూర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుడి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి వివరాలు.. రామంతాపూర్ ఇందిరానగర్ కు చెందిన గండమళ్ల చందన (23) మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ కంటి ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. ఏడాదిన్నరగా బొమ్మలరామారానికి చెందిన తుడుము శివ అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. యువకుడు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని తల్లి ఆరోపిస్తోంది. పలుమార్లు హెచ్చరించినా ప్రవర్తనలో మార్పు రాలేదని ఫిర్యాదులో పేర్కొంది. వేధింపులు భరించలేకపోతున్నానని చందన తన అక్క వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అక్టోబర్ 22న ఇంట్లో చందన ఉరి వేసుకుని కనిపించింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. యువతి మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!