Wednesday, October 28, 2026
Homeక్రైమ్ న్యూస్కుళ్లిన అల్లం.. ఫంగస్‌ వెల్లుల్లితో పేస్ట్‌...

కుళ్లిన అల్లం.. ఫంగస్‌ వెల్లుల్లితో పేస్ట్‌ తయారీ!

📰 Generate e-Paper Clip

🔸అత్వెల్లిలో ‘ఏ1’ కేంద్రంపై అధికారుల మెరుపుదాడి
🔸22 కిలోల వెల్లుల్లి.. 50 కిలోల అల్లం స్వాధీనం చేసినట్లు వెల్లడి

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ :  ప్రజలకు విక్రయించే ఆహార పదార్థాల తయారీలో ఇంత నిర్లక్ష్యమా? ఫంగస్‌ పట్టి కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్‌ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించడం కలకలం రేపింది. మేడ్చల్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని అత్వెల్లి గ్రామంలో ‘ఏ1’ బ్రాండ్‌ తయారీ కేంద్రంపై శుక్రవారం ఉదయం ఎస్‌ఓటీ, టీజీసీఎఫ్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో 22 కిలోల కుళ్లిన వెల్లుల్లి, 50 కిలోల అల్లం గుర్తించినట్లు మేడ్చల్‌–కుత్బుల్లాపూర్‌ జోన్‌ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ అమృత శ్రీ వెల్లడించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వినియోగానికి పనికిరాని ముడి పదార్థాలతో అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేసి ‘ఏ1’ బ్రాండ్‌ పేరుతో మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. విక్రయానికి సిద్ధంగా ఉన్న ఉత్పత్తుల నమూనాలను అధికారులు సేకరించారు.ఆహార పదార్థాల తయారీకి అవసరమైన లైసెన్స్‌లు తీసుకోవడంతోపాటు పరిశుభ్రమైన ప్రదేశాల్లోనే ఉత్పత్తులు తయారు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆహార కల్తీ కనిపిస్తే ఫిర్యాదు చేయండి

పాలు, అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ సహా ఇతర ఆహార పదార్థాల నాణ్యతపై అనుమానాలు ఉంటే ప్రజలు టోల్‌ఫ్రీ నంబరు: 9100105795కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ అమృత తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!