🔸టాటా ఏస్‌లో బయటకు పొడుచుకొచ్చిన ఇనుప షీట్లు..
🔸బైక్‌పై వెళ్తున్న యువకుడి మెడకు గుచ్చుకుని మృతి
🔸యాప్రాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : రవాణా వాహనంలో ప్రమాదకరంగా బయటకు పొడుచుకొచ్చిన ఇనుప రేకులు ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి. ఎలాంటి హెచ్చరిక సూచికలు లేకుండా టాటా ఏస్ వెనుక భాగం నుంచి బయటకు వచ్చిన ఇనుప రేకులు బైక్‌పై వెళ్తున్న యువకుడి మెడ, భుజానికి గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు. ఈ విషాద ఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాము నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీనగర్‌కు చెందిన కొయ్యాడ భరత్ గౌడ్ (29) ప్రైవేట్ ఉద్యోగి. బుధవారం సాయంత్రం యాప్రాల్ నుంచి పల్సర్ బైక్‌పై బాలాజీనగర్‌కు వెళ్తుండగా నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా జీకే ప్రైడ్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఇనుప రేకులు లోడ్ చేసిన టాటా ఏస్ ట్రాలీ ఆటో ఎడమవైపు మలుపు తీసుకునే క్రమంలో రహదారిపై ఉన్న ఎత్తు కారణంగా అకస్మాత్తుగా వెనక్కి కదిలింది. అదే సమయంలో వాహనం వెనుక నుంచి ప్రమాదకరంగా పొడుచుకొచ్చిన ఇనుప రేకులు భరత్ మెడ, భుజానికి గుచ్చుకున్నాయి. తీవ్రంగా గాయపడిన భరత్‌ను 108 అంబులెన్స్‌లో ఎస్.ఆర్.నగర్‌లోని జెమ్ కేర్ పౌలోమి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడి తండ్రి కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
