Saturday, November 7, 2026
Homeక్రైమ్ న్యూస్నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి జారిపడి...

నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి జారిపడి మహిళా కార్మికురాలు మృతి

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లన్న కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై పనిచేస్తున్న మహిళా కార్మికురాలు రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందింది.
జాంగీర్ అనే వ్యక్తికి చెందిన నూతన భవన నిర్మాణ పనుల్లో స్వరూప అనే మహిళా కూలీగా పనిచేస్తోంది. ఈ క్రమంలో రెండో అంతస్తులో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన స్వరూపగా గుర్తించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గతంలోనే భర్త మృతి చెందడంతో ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కుటుంబానికి ఆధారంగా ఉన్న తల్లి ఆకస్మికంగా మృతి చెందడంతో పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పేరు బషీరాబాద్ పోలీసులు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!