Saturday, November 7, 2026
Homeమేడ్చల్ జిల్లాTSUTF మేడ్చల్ మండల నూతన కార్యవర్గం...

TSUTF మేడ్చల్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక

📰 Generate e-Paper Clip

🔸అధ్యక్షుడిగా సంజీవరెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా జనార్ధన్ ఏకగ్రీవం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) మేడ్చల్ మండల మహాసభ శనివారం జడ్పీహెచ్‌ఎస్ నూతనకల్ పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు కె. జైసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలు, హక్కుల సాధనకు చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.ఉపాధ్యాయ హక్కుల కోసం నిరంతరం పోరాడే సంఘం TSUTF అని, త్వరలో పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్లుల సాధన కోసం ఉద్యమానికి ఉపాధ్యాయులు సిద్ధం కావాలని జైసింహారెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ మండలంలో 24 శాతం హెచ్ఆర్ఏ అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS)ను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం నూతన మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఎస్‌కే నారాయణ, అధ్యక్షుడిగా కె. సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె. జనార్ధన్, ఉపాధ్యక్షుడిగా వి. ప్రభాకర్, మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్. అమృత, కోశాధికారిగా పి. శేఖర్, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా ఎం. ప్రభాకర్, జిల్లా ప్రతినిధిగా వి. మల్కయ్య ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. మదన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి కె. విజయభాస్కర్‌రెడ్డి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!